ఏపీ మంత్రి నానికి ఆర్జీవీ ప్రశ్నల వర్షం

ఏపీ మంత్రి నానికి ఆర్జీవీ ప్రశ్నల వర్షం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల అంశంపై సర్వత్రా జరుగుతోంది. టికెట్ల ధరలను తగ్గిస్తూ జగన్ సర్కారు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సినీ వర్గాలు కాస్త అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. హీరో నాని లాంటి కొందరు చేసిన కామెంట్లు దీనికి ఊతమిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు స్పందించిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. తాజాగా ట్విటర్‌ వేదికగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని కోరారు. 

  • సినిమా సహా ఏదైనా ఉత్పత్తికి ధర నిర్ణయంలో ప్రభుత్వ పాత్ర ఎంత?
  • హీరోల రెమ్యూనరేషన్‌ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు, రాబడిపైనే ఉంటుంది. ఖర్చు, రాబడి విషయాన్ని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలి. నిత్యావసరాల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వ జోక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ సర్కారు జోక్యంతో సమతుల్యత కంటే దిగువన లేదా ఎక్కువ ధర నిర్ణయిస్తారు. అదే రీతిలో సినిమాలకు ఎలా వర్తింపజేస్తారు?
  • ఆహార ధాన్యాల్లోనూ బలవంతంగా ధర తగ్గిస్తే రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారు. ప్రోత్సాహం కోల్పోతే నాణ్యత లోపాన్ని సృష్టిస్తుంది. అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుంది. పేదలకు సినిమా చాలా అవసరమని మీకు అనిపిస్తే రాయితీ ఇవ్వొచ్చు కదా?
  • ప్రభుత్వ జేబులోంచి వైద్య, విద్యా సేవలకు రాయితీలు ఇస్తున్నారు. అదే రీతిలో సినిమాలకు కూడా ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ ఇవ్వదు?
  • పేదలకు బియ్యం, పంచదార అందించడానికి రేషన్ షాపులు సృష్టించబడ్డాయి. మీరు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా? అని ఆర్జీవీ ప్రశ్నించారు. 

పైక్వశ్చన్స్ కు మంత్రి పేర్ని నాని సమాధానం ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. ‘ద్వంద్వ ధరల విధానంలో పరిష్కారం ఉంటుంది. నిర్మాతలు వారి ధరకు టికెట్లను విక్రయించొచ్చు. ప్రభుత్వం కొన్ని టికెట్లు కొని పేదలకు తక్కువ ధరకు అమ్మొచ్చు. అలా చేస్తే మేం మా డబ్బును పొందుతాం.. మీరు మీ ఓట్లు పొందండి. మీ ప్రభుత్వానికి ప్రజలను ఆదుకునే అధికారం ఇచ్చారు. మా తలపై కూర్చోవడానికి కాదని అర్థం చేసుకోవాలి’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. ఆడమ్‌ స్మిత్‌ వంటి ఆర్థికవేత్తల మార్గదర్శక ఆర్థిక సూత్రాల ప్రకారం ప్రైవేటు వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యం ఏ మాత్రం పనిచేయదని ఆర్జీవీ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం: 

50 శాతం సెంట్రల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

పంజాబ్‌లో స్కూళ్లు, కాలేజీలు క్లోజ్

ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏం చేయాలంటే..