టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ని కలిసిన శ్రీశైలం చైర్మెన్ పోతుగుంట రమేష్ నాయుడు..

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ని కలిసిన శ్రీశైలం చైర్మెన్ పోతుగుంట రమేష్ నాయుడు..

గురువారం ( అక్టోబర్ 30 ) టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను కలిశారు శ్రీశైలం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. తిరుమలలో జరిగిన ఈ భేటీలో స్వామివారి వస్త్రము, ప్రసాదం అందజేసి దోర్నాల దగ్గర భక్తులు, యాత్రికుల కోసం టీటీడీ వసతి సముదాయం, డార్మెటరీ నిర్మించాలని కోరారు రమేష్ నాయుడు. అలాగే శ్రీశైలంలో కూడా టీటీడీ వసతి సముదాయాన్ని నిర్మించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు వినతి పత్రం ఇచ్చారు.

ఈ క్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సానుకూలంగా స్పందించారని.. టీటీడీ తరపున బోర్డు మెంబెర్ భాను ప్రకాష్ రెడ్డిని శ్రీశైలం వెళ్లి ఎన్ని గదులు అవసరం అవుతాయో పరిశిలించి టీటీడీ పాలకమండలి తెలియజేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పదిరోజుల్లో శ్రీశైలం దర్శనానికి వచ్చి వసతి సముదాయాల గురించి పరిశీలించి పూర్తిస్థాయిలో నివేదిక ఇస్తామని చెప్పారని అన్నారు రమేష్ నాయుడు.

అడిగిన వెంటనే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా వసతి గదుల సముదాయం నిర్మిస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.