తిరుమల కల్తీ నెయ్యి బాగోతం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు గుర్తించారు సిట్ అధికారులు.మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాలను ప్రస్తావించారు సిట్ అధికారులు. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను 24వ నిందితుడిగా చేర్చారు సిట్ అధికారులు. 2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్ ను అప్పన్న సంప్రదించి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాలు తీసుకున్నారని పేర్కొంది సిట్.
టిటిడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా భోలే బాబా డైరీ యాజమాన్యానికి అప్పన్న ఫోన్ చేశారని.. బోలే బాబా కంపెనీ ప్రతినిధి పీపీ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి టీటీడీకి సరఫరా చేసే ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. కమీషన్ ఇవ్వడానికి భోలే బాబా డైరీ యాజమాన్యం నిరాకరించడంతో డైరీని అనర్హులుగా ప్రకటించేలా అప్పన్న కుట్ర పన్నారని పేర్కొంది సిట్.
బోలేబాబా డైరీలో తనిఖీలు చేయాలంటూ టిటిడి ప్రొక్యూర్ మెంట్ జీఎమ్ పై ఒత్తిడి తెచ్చారని.. భోలే బాబా డైరీని అనర్హులుగా ప్రకటించే ప్రయత్నంలో డైరీకి వ్యతిరేకంగా అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు వేయించారని తెలిపింది సిట్. అప్పన్న ఒత్తిళ్లు, కుట్రలతో టీటీడీ బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సేకరణ నిలిపేసిందని తెలిపింది సిట్.భోలే బాబా డైరీ టెండర్ల నుంచి తొలగిపోవడంతో ఆ స్థానంలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రవేశించిందని పేర్కొంది సిట్.
ప్రీమియర్ అగ్రిఫుడ్స్ బోలేబాబా డైరీ కంటే కిలో కు రూ.138 ఎక్కువ కోట్ చేసిందని.. పోటీ లేకపోవడంతో అగ్రి ఫుడ్స్ టీటీడీ నుంచి నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుందని తెలిపింది సిట్.చిన్న అప్పన్నకు రూ.50 లక్షల వరకు ముడుపులు ముట్టినట్లు విచారణ లో గుర్తించామని తెలిపింది సిట్.ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రమోటర్లతో అప్పన్న నిరంతరం సంప్రదింపులు జరిపారని.. అప్పన్న బ్యాంకు లావాదేవీలను పరిశీలించి అక్రమాల నిగ్గు తేల్చినట్లు తెలిపింది సిట్.
