తెలంగాణ ఉద్యమకారుడు నాగరాజుకు షర్మిల ఆర్థికసాయం

తెలంగాణ ఉద్యమకారుడు నాగరాజుకు షర్మిల ఆర్థికసాయం

నారాయణపేట : ప్రగతి భవన్ వద్ద రెండ్రోజుల ఆత్మహత్యాయత్నం చేసిన దివ్యాంగుడు నాగరాజుకు వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆర్థిక సాయం చేశారు. ఘటనకు సంబంధించిన వార్తను పేపర్ లో చూసిన షర్మిల ఆయనను నారాయణ పేట పిలిపించారు. స్వాతంత్ర్య దినోత్సవ సభలో రూ.4 లక్షల నగదు అందజేశారు. నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

హుజూర్ నగర్ టౌన్ కు చెందిన నాగరాజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. 2011లో జరిగిన రైల్ రోకోలో రెండు కాళ్లు, చేతులు పోగొట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఎకరా పొలం, రూ.70లక్షల ఆర్థిక సాయం ఇస్తామని మాట ఇచ్చారని, అయితే 8 ఏండ్లు గడిచినా ఆ హామీ నిలబెట్టుకోలేదని నాగరాజు వాపోయాడు. ఉద్యమంలో సర్వం కోల్పోయిన తనకు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రెండ్రోజుల క్రితం ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పాడు.