
నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో YSRTP అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. 18 వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మర్రిగూడ మండలం దామర క్రాస్ నుంచి నడక మొదలైంది. బొజ్జతండా, నేరెల్లపల్లి గ్రామంలో స్థానికులతో మాట్లాడారు షర్మిల. నేరెళ్లపల్లి గ్రామంలో మండల్ పరిషత్ హైస్కూల్ ను విజిట్ చేశారు. స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన ఆమె.... సమస్యలపై ఆరా తీశారు. సిబ్బంది కొరత, మధ్యాహ్న భోజన బిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూళ్లలో కనీసం టాయిలెట్స్ కూడా లేవని వివరించారు స్టూడెంట్స్. తర్వాత నర్సింహగూడెం, చండూర్ మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో పాదయాత్ర సాగింది. దారిలో పత్తి చేలో కూలీలతో మాట్లాడారు షర్మిల. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. లంచ్ తర్వాత తుమ్మలపల్లి గ్రామం నుంచి పాదయాత్ర మొదలుకాగా.. బంగారిగడ్డ గ్రామంలో మాట ముచ్చట నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఇడిగూడ కాలనీలో ఇవాల్టి షర్మిల పాదయాత్ర ముగియనుంది.