కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దాం

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేయాలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోతున్నాయని చెప్పారు. ఈ సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వరి మీద కిరికిరి పెడుతూ.. కల్లాల్లో కయ్యాలు పెడుతూ, హస్తినలో దోస్తానా చేస్తున్నాయని పేర్కొన్నారు. ధర్నాల డ్రామాలతో పంటను కొనకుండా రైతులను చనిపోయేలా చేస్తున్నాయని మండిపడ్డారు.

రైతు ఆవేదన తీర్చేవారే లేరని షర్మిల అన్నారు. అన్నదాత చనిపోతే కనీసం వారి కుటుంబాలను ఓదార్చే దిక్కు లేదన్నారు. రైతులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నఈ రైతు హంతక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దామని పిలుపునిచ్చారు. అందుకే ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుందామని ఆమె ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

బిగ్​బాస్​పై ఫైర్​ అయితున్నరు

జిల్లా కోర్టులో బాంబు పేలుడు

లిక్కర్ సేల్స్కు జోష్ ఇస్తున్న వింటర్ సీజన్