జిల్లా కోర్టులో బాంబు పేలుడు

జిల్లా కోర్టులో బాంబు పేలుడు

పంజాబ్ లోని లుధియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. కోర్టు కాంప్లెక్స్ లో హఠాత్తుగా బాంబు పేలడంతో అక్కడున్న వారు పరుగులు తీశారు. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్ తోపాటు ఫోరెన్సిక్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా, పేలుడు దెబ్బకు కోర్టు కాంప్లెక్స్ లో ఓ గోడ కూలింది. పేలుడు తర్వాత కోర్టు కాంప్లెక్స్ మొత్తం పొగ ఆవరించి ఉన్న వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

కోర్టు కాంప్లెక్స్ లో బాంబు పేలుడు ఘటనపై పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందించారు. తాను లుథియానాకు వెళ్తున్నానని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యతిరేక శక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన అన్నారు. అయితే తమ ప్రభుత్వం అలర్ట్ గా ఉందని.. దోషులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

వ్యాక్సినేషన్ లో భారత్ కొత్త రికార్డు

పత్తి రైతు ఆత్మహత్యాయత్నం