కేసీఆర్ రైతులకు బతుకు లేకుండా చేస్తుండు

కేసీఆర్ రైతులకు బతుకు లేకుండా చేస్తుండు

వడ్లు కొనాల్సిన బాధ్యత  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. వరి కొనని ముఖ్యమంత్రి తమకొద్దన్నారు. కేసీఆర్ ఏడున్నరేళ్ల పాలనలో 8 వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.  కేసీఆర్ కు బార్లు,వైన్స్ ల మీదున్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు ఇచ్చేది రూ. 5 వేలేనన్నారు. బోడి ఐదు వేలు ఇచ్చి.. ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సురెన్స్, యంత్రలక్ష్మి బంద్ పెట్టి.. రూ. 25 వేలు ఆపుతున్నారన్నారు. రైతులపై బీజేపీ టీఆర్ఎస్ వి డ్రామాలన్నారు. అధికార పార్టీ నేతలకు కరోనా రూల్స్ వర్తించవా అని అన్నారు. నల్గొండలో కేటీఆర్ రూల్స్ బ్రేక్ చేశారన్నారు. కేటీఆర్ పై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. 

ఏపీ  రాజకీయాలపై మరోసారి  క్లారిటీ ఇచ్చిన షర్మిల ..ఎవరైనా ఎక్కడైయినా పార్టీ పెట్టొచ్చన్నారు. తన  బతుకు ఇక్కడ ముడిపడి ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలకు సేవచేయడానికి వైఎస్సార్ టీపీ స్థాపించానన్నారు. తెలంగాణా ప్రజలపక్షాన సేవచేయడానికి.. ఇక్కడ వైఎస్ఆర్ ను ప్రేమించిన  ప్రజలకు సేవ చేస్తానన్నారు. అధికారంలో ఉన్న వారు ఎప్పటికి అధికారంలో ఉండలేరన్నారు.  పాలిటిక్స్ అంటే అప్స్ అండ్ డౌన్స్  ఉంటాయని.. రాజకీయాల్లో ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చన్నారు.

https://www.youtube.com/watch?v=REcCrjQ5e9U