కాంట్రాక్ట్ ఉద్యోగులతో చాకిరి చేయిస్తుండ్రు

కాంట్రాక్ట్ ఉద్యోగులతో చాకిరి చేయిస్తుండ్రు

తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ పదమే ఉండదని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మీ పాలనంతా కాంట్రాక్ట్ సిబ్బందితోనే నడిపిస్తున్నారు కదా అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. టీచర్ నుంచి డాక్టర్ దాకా అందరినీ కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నారు కదా.. మరి సీఎం పదవి కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటే సరిపోదా? అని ప్రశ్నించారు. ఏండ్ల తరబడి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా.. కాంట్రాక్టు ఉద్యోగులతో చాకిరి చేయించుకుంటూ వారి శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. మరోవైపు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులు చనిపోయేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో పాటు అవుట్ సోర్సింగ్ ఖాళీలను కూడా భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

For More News..

నా సమస్యకు పరిష్కారం ఢిల్లీలోనే దొరుకుద్ది

మేడారం జాతర ఫొటో గ్యాలరీ