కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వాలి

కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వాలి

పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు వైఎస్ షర్మిల. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ ఉంటే ..ఆక్సిజన్ ఉండదు..ఆక్సిజన్ ఉంటే  డాక్టర్లు ఉండరని విమర్శించారు. ప్రాణాలతో ఉంటే చాలని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి..అప్పుల పాలయ్యారన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ కు కరోనా వస్తే యశోద ఆస్పత్రికి వెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదు..ఆ ఆస్పత్రులపై మీకు  నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల.సీఎం కేసీఆర్ కు ఒక న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా అని అన్నారు. కరోనా తో చనిపోయిన పేద ప్రజల కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వాలి డిమాండ్ చేశారు. కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చమంటే..కేసీఆర్ ఆయుష్మాన్ భారతో లో చేర్చామన్నారు. ఆయుష్మాన్ భారత్ వేస్ట్ అన్న సీఎం కేసీఆర్...అదే పథకాన్ని ఎందుకు ప్రవేశ పెట్టారు చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.