రైతు ఆవేదన తీర్చలేని సీఎం మనకు అవసరమా? 

రైతు ఆవేదన తీర్చలేని సీఎం మనకు అవసరమా? 

హైదరాబాద్: రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలు, ధర్నాలతో డ్రామాలు చేస్తోందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. తమకు ఏ దిక్కూ లేదని అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. పంట పండక, పెట్టుబడి రాక, అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగి రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నారని.. కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా దొరకు లేదని మండిపడ్డారు. ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షలు ఇచ్చే కేసీఆర్ కు, మన రైతులు చనిపోతే పట్టించుకోవడానికి కనీసం టైమ్ కూడా లేదని షర్మిల ట్వీట్ చేశారు. 

రైతులు చనిపోయేలా చేస్తున్న రైతు హంతక ప్రభుత్వం ఇది అని షర్మిల విమర్శించారు. అన్నదాతను అప్పులపాలు చేస్తున్న సీఎం మనకొద్దన్నారు. రైతు ఆవేదన తీర్చలేని ముఖ్యమంత్రి మనకు ఎందుకని క్వశ్చన్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

విషమించిన తల్లి ఆరోగ్యం.. నళినికి నెల రోజుల పెరోల్

మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

నాని ఎవరో నాకు తెలియదు