మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

భారత్ లో ఒమిక్రాన్ వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య 358కు చేరాయి. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్ నేపథ్యంలో బహిరంగ కార్యక్రమాలపై నిషేధం విధించాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కూడా నైట్ కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు యూపీలోని యోగి సర్కార్ ప్రకటించింది.  పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మాత్రం కేవలం 200 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. కరోనా నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. అయితే యూపీలో మరో రెండు నెలల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌ను అలహాబాద్ హైకోర్టు అభ్యర్థించిన మరుసటి రోజు ఉత్తరప్రదేశ్ నైట్ కర్ఫ్యూ ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయడం విశేషం. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ ఇప్పటి వరకు రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే వారిద్దరూ చికిత్స తీసుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. గురువారం యూపీలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహన్. మధ్యప్రదేశ్ తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న రెండో రాష్ట్రం యూపీనే.

ఇవి కూడా చదవండి:

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆన్లైన్ పెళ్లికి హైకోర్టు అనుమతి

ఎడారిలో ఒంటెపై వెళ్లి వ్యాక్సినేషన్