సినిమాలకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకి..

సినిమాలకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకి..

అమరావతి: సినిమా ఇండస్ట్రీపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. హీరో నాని ఎవరో తనకు తెలియదన్నారు. కొడాలి నాని మాత్రమే తనకు తెలుసన్నారు. పవన్ కల్యాణ్ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారని విమర్శించారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు అయిన ఖర్చెంత, అందులో పవన్ రెమ్యూనరేషన్ ఎంత అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. పవన్ రూ. 50 కోట్లకు బదులుగా రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటే కొత్తగా సవరించిన టిక్కెట్ ధరలతో నష్టం ఉండదన్నారు. చారిత్రక, సందేశాత్మక చిత్రాలకు గతంలో రేట్లు పెంచుకునే వారన్నారు. అభిమానులు ఆవేశపడి జేబులు గుల్ల చేసుకోవద్దని సూచించారు.

సినిమాకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయని అనిల్ కుమార్ ఆరోపించారు. ఆ నలుగురు తీసుకునే కోట్లాది రూపాయలను జనం నుంచి వసూలు చేసేందుకు తాము పర్మిషన్ ఇవ్వాలా అని క్వశ్చన్ చేశారు. కోట్లాది మంది ప్రజలపై భారం పడేలా టిక్కెట్ రేట్లు పెంచమనడం సమంజసమా అని ప్రశ్నించారు. కాగా, థియేటర్లలో సినిమా కలెక్షన్లను కిరాణాకొట్ల వసూళ్లతో పోల్చుతూ ఏపీ ప్రభుత్వ తీరుపై హీరో నాని సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా నాని మాట్లాడుతూ.. టికెట్‌ ధరలను తగ్గించడం అంటే ప్రేక్షకులను అవమానించడమేనన్నారు. సినిమా హాళ్ల యజమానులు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారని.. ఇప్పుడు టికెట్‌ ధరల తగ్గింపుతో వారంతా భారీగా నష్టపోవడం ఖాయమన్నారు. పదిమందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్‌ కంటే ఆ పక్కనే ఉండే కిరాణా కొట్టు కలెక్షన్‌ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. సినిమాకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయని ఆరోపించారు.

మరిన్ని వార్తల కోసం: 

ఎడారిలో ఒంటెపై వెళ్లి వ్యాక్సినేషన్ 

బర్త్ డే పార్టీలో.. తలపై బీర్ బాటిల్స్ పగులగొట్టారు

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి