ఎడారిలో ఒంటెపై వెళ్లి వ్యాక్సినేషన్ 

ఎడారిలో ఒంటెపై వెళ్లి వ్యాక్సినేషన్ 

బర్మేర్: దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. రీసెంట్ గా వ్యాక్సినేషన్ లో భారత్ కొత్త మైలరాయిని చేరుకుంది. దేశ జనాభాలో అర్హులైన వారిలో 60 శాతం మందికి టీకా రెండు డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. టీకా తీసుకోని వారికి వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్లు చాలా శ్రమిస్తున్నారు. టీకాపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓ హెల్త్ వర్కర్ ఏకంగా ఒంటెపై వెళ్లి టీకా ఇవ్వడం విశేషం.

రాజస్థాన్ లోని బల్మేర్ కు చెందిన ఒక ఆరోగ్య కార్యకర్త ‘హర్ ఘర్ దస్తక్’ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఓ గ్రామానికి ఒంటె మీద వెళ్లారు. గ్రామస్తులకు టీకా ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎడాదిలో ఒంటె మీద వెళ్లి మరీ తన బాధ్యతను నిర్వర్తించిన హెల్త్ వర్కర్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

రాధే శ్యామ్ అంచనాలకు ఏమాత్రం తగ్గదు

రాజీవ్ గాంధీ హత్య కేసు దోషికి పెరోల్