ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కు ఐదేళ్లు పట్టింది

ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కు ఐదేళ్లు పట్టింది

మహిళల హక్కుల సాధన కోసం  కొట్లాడుతానన్నారు వైఎస్ షర్మిల. మహిళలుగా తమ హక్కులను అడగాల్సి రావడం దురదృష్టకరమన్నారు. అవసరమైనప్పుడు నడుం బిగించి మార్పు సాధించాలన్నారు. మహిళలంటే ఎందుకంత చులకన భావన? అని అన్నారు. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మహిళపై చిన్నచూపు తగదన్నారు. వైఎస్ హయాంలో ఎంతోమందికి మహిళలకు మంత్రి వర్గంలో చోటు ఉండేదన్నారు. రాష్ట్రం వచ్చి ఐదేళ్లయినా ఇద్దరు మహిళలకే అవకాశం ఇచ్చారన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. మహిళకు తగిన ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.