వైఎస్‌ను గుర్తు చేసుకున్న విజయమ్మ

వైఎస్‌ను గుర్తు చేసుకున్న విజయమ్మ

పాదయాత్ర అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచారన్నది కాదు... పరుగుపందెం అంతకంటే కాదు కాదన్నారు. ఎంత మందిని కలిసి వారి బాధలు విన్నామన్నదే ముఖ్యమన్నారు వైఎస్ విజయమ్మ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని పాలించారన్నారు. జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు కట్టి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన వైఎస్ ప్రజాప్రస్థాన పాదయాత్ర సభలో మాట్లాడారు వైస్ విజయలక్ష్మి.

ఎన్నికల కోడ్ వల్ల పాదయాత్ర ను రద్దు చేయడం జరిగిందన్నారు.  వైస్సార్ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టులను తీసుకు వచ్చారన్నారు.  రైతుల సంక్షేమం ప్రాజెక్టులు , ప్రభుత్వం అనేక సబ్సిడీ లు అందించారన్నారు వైస్సార్.  గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ తీసుకువచ్చారన్నారు.  తెలంగాణ కోసం అమర వీరుల కుటుంబాలకు వైఎస్ షర్మిల ఆసరాగా ఉంటుందని అన్నారు.  పాదయాత్ర ద్వారా గడపగడపకు వస్తోంది ఆశీర్వదించలని కోరారు విజయలక్ష్మి.వైఎస్ షర్మిల బంగారు తెలంగాణ లక్ష్యంగా పని చేస్తోందన్నారు విజయమ్మ. 

ఇవి కూడా చదవండి:

ఉత్తరాఖండ్ కొత్త సీఎం వేటలో బీజేపీ

గవర్నర్కు రాజీనామా సమర్పించిన సీఎం యోగి