ఉత్తరాఖండ్ కొత్త సీఎం వేటలో బీజేపీ

ఉత్తరాఖండ్ కొత్త సీఎం వేటలో బీజేపీ

ఉత్తరాఖండ్ సిట్టింగ్ సీఎం పుష్కర్ ధామీ పరాజయంతో బీజేపీ కొత్త సీఎం వేట మొదలుపెట్టింది. ఇందుకోసం ఇద్దరు కేంద్రమంత్రుల్ని డెహ్రాడూన్కు పంపింది. బీజేపీ హైకమాండ్ దూతలుగా అక్కడికి వెళ్లిన కేంద్ర మంత్రులు కైలాష్ విజయ్ వర్గీయ,  ప్రహ్లాద్ జోషీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్లకు  ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్ధిని ఎంపిక చేసే బాధ్యతను అధిష్టానం అప్పగించింది. వీరు త్వరలో డెహ్రాహూన్ వెళ్లి సీఎం పేరు ప్రకటించనున్నారు. 

ఉత్తరాఖండ్ కొత్త సీఎం రేసులో మాజీ సీఎం పుష్కర్ ధామీ ఉండకపోవచ్చని సమాచారం. ధామీ ఇప్పుడు జాతీయ నాయకుడన్న  కైలాస్ విజయ్ వర్గీయ వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తోంది. అయితే బీజేపీ నేత తేజిందర్ బగ్గా, "ధామీ మరోసారి" అని ట్వీట్ చేయడంతో అధిష్టానం మరోసారి పుష్కర్ సింగ్కు అవకాశమిస్తుందన్న  ఊహాగానాలు వినిపిస్తున్నారు. పార్టీ సీనియర్లు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్ కూడా సీఎం రేసులో ఉన్నారని సమాచారం.

For more news..

ప్రాజెక్ట్‌ను ఆపాల్సిన‌ బాధ్యత బండి సంజయ్‌దే

చైనాలో విజృంభిస్తున్న కరోనా