ప్రాజెక్ట్‌ను ఆపాల్సిన‌ బాధ్యత బండి సంజయ్‌దే

 ప్రాజెక్ట్‌ను ఆపాల్సిన‌ బాధ్యత బండి సంజయ్‌దే

అనుమతి లేని ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం నుండి మిడ్ మానేరుకి కొత్తగా కేసీఆర్ సర్కార్ అదనపు టీఎంసీ కాలువను ఏర్పాటు చేయబోతుంది. అయితే కాలువ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల విలాసాగర్ గ్రామ ప్రజలు నిరహారదీక్షకు దిగారు. ఈ దీక్ష రెండో రోజుకు చేరడంతో.. నిరసనకారుల్ని కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీ భావం తెలిపారు. కమీషన్ల కక్కుర్తి పడే ప్రాజెక్ట్  నిర్మాణం చేస్తున్నారన్నారు.  అక్కడ సంఘమేశ్వర.. ఇక్కడ మూడో టీఎంసీ తరలించే ప్రాజెక్ట్ రెండూ మెఘా -కంపెనీకే కట్టబెట్టారన్నారు. 

రైతుల భూములకు  బదులు కేసీఆర్ ఫాంహౌస్ లో‌ ఎకరం‌ భూమి ఇవ్వాలన్నారు జీవన్ రెడ్డి. ప్రాజెక్ట్ ను ఆపాల్సిన‌ బాధ్యత బండి సంజయ్ దే అన్నారు. ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్ట్ నుండి‌ వందల టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని ఆరోపించారు. ఆ నీటిని ఎలా వాడాలో తెలియదన్నారు. ఉన్న నీటిని వాడలేక‌ కేవలం కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకే ఈ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంఘమేశ్వర  ప్రాజెక్ట్ ద్వారా ఏపి ప్రభుత్వం కృష్ణ నీటిని తీసుకుపోతుంటే మన సీఎం ఏం మాట్లాడటం లేదన్నారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరి నీటిని అదనంగా మరో టీఎంసీని తరలిస్తే ఏపీ సీఎం ఏం మాట్టాడరని అన్నారు. ఇద్దరు సీఎంలు కుమ్మక్కైయ్యారని ఆరోపించారు.  ప్రస్తుతం ఉన్న కాలువ ద్వారా ఏడాదికి 390 టీఎంసీల నీటిని తరలింపవచ్చని అన్నారు. అలాంటప్పుడు మూడో టీఎంసీ నీటిని తరలించే అవసరం ఏం వచ్చిందన్నారు.

ఇవి కూడా చదవండి:

రైతుబంధు లాంటి స్కీం దేశంలో ఎక్కడా లేదు

చైనాలో విజృంభిస్తున్న కరోనా