గవర్నర్కు రాజీనామా సమర్పించిన సీఎం యోగి

గవర్నర్కు రాజీనామా సమర్పించిన సీఎం యోగి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులతో కలిసి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ నివాసానికి వెళ్లిన ఆయన రాజీనామా పత్రం అందజేశారు. దీంతో యూపీలో ప్రభుత్వం రద్దైంది. కొత్త సర్కారు కొలువుదీరే వరకు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరగా అందుకు యోగి అంగీకరించారు. అంతకు ముందు యూపీలో మరోసారి అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ సాధించినందుకు గానూ గవర్నర్ ఆనందీబెన్.. సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. 

403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ 255 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 111 సీట్లను ఖాతాలో వేసుకుని రెండో పెద్ద పార్టీగా నిలిచింది.

మరిన్ని వార్తల కోసం..

సీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్

రైతుబంధు లాంటి స్కీం దేశంలో ఎక్కడా లేదు