సీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్

సీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్

పది, పన్నెండో తరగతి విద్యార్థుల టర్మ్  2 ఎగ్జామ్ షెడ్యూల్ను సీబీఎస్ఈ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 26 నుంచి థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు  ప్రకటించింది. టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 26న ప్రారంభమై మే 24తో ముగియనున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26న మొదలై జూన్ 15తో ముగుస్తాయి. ఆఫ్ లైన్ మోడ్లో నిర్వహించే ఈ ఎగ్జామ్స్ ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరగనున్నాయి. బోర్డు వైబ్ సైట్లో అందుబాటులో ఉన్న శాంపిల్ ప్రశ్నాపత్రంలాగే క్వశ్చన్ పేపర్ ఉంటుందని సీబీఎస్ఈ ప్రకటించింది. 

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రెండు విడతలుగా ఎగ్జామ్స్ నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. 10,12వ తరగతి టర్మ్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. జేఈఈ మెయిన్స్, ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకుని డేట్ షీట్ రూపొందించినట్లు అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

కోర్టులో కూడా న్యాయం జరగలేదు

పంజాబ్ ఎలక్షన్లలో సత్తా చాటిన వైద్యులు