మీ బిడ్డగా షర్మిలను ఆశీర్వదించండి

V6 Velugu Posted on Oct 28, 2021

మీ బిడ్డగా షర్మిలను ఆశీర్వదించాలని వైఎస్‌ విజయమ్మ కోరారు. ఇవాళ్టి(గురువారం) షర్మిల పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలు రాయి దాటిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
షర్మిల సంకల్ప బలం గొప్పదని, ధైర్యంగా ఆటుపోట్లు ఎదుర్కొంటోందన్నారు వైఎస్‌ విజయమ్మ. ప్రజలతో మమేకం అవ్వడంలో పాదయాత్రకి మించిన సాధనం లేదన్నారు. ప్రతివర్గం కోసం పోరాడే వ్యక్తిగా షర్మిల ప్రజల ముందుకు వస్తోందని తెలిపారు. ఆనాడు వైఎస్సార్ పాదయాత్ర చరిత్ర సృష్టించిదని గుర్తుచేశారు. అదే విలువలు విశ్వసనీయత ఆమె రక్తంలోనే ఉందని.. భవిష్యత్ తరాలకు పునాది షర్మిల పాదయాత్ర అని చెప్పారు. YSR ఏ విధంగా అయితే ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారో.. అదే విధంగా షర్మిల ప్రజల కష్టాలు తెలుసుకుంటోందన్నారు. తెలంగాణ లో ప్రజల బాధలు తీర్చిడానికి షర్మిల వస్తోందని..ఆదరించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల పాదయాత్ర ఒక నూతన ఒరవడి అని అన్నారు YS  విజయమ్మ.

Tagged YS Vijayamma, bless Sharmila, your child

Latest Videos

Subscribe Now

More News