సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు ఫైళ్లు

సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు ఫైళ్లు

వైఎస్ వివేకానంద హత్య కేసులో విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసుకు సంబంధించిన ఫైళ్లను హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకు అప్పగించారు. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి మూడు పెట్టెల్లో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఛార్జ్‌షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర డాక్యుమెంట్లు తరలించారు. హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. కేసు బదిలీ అయిన నేపథ్యంలో.. హైదరాబాదులోని సీబీఐ కోర్డు త్వరలోనే వివేకా హత్య కేసు విచారణ ప్రారంభించనుంది.