పాలమూరు జిల్లాలోనూ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కమీషన్లు దండుకున్నారు : వైఎస్ షర్మిల

పాలమూరు జిల్లాలోనూ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కమీషన్లు దండుకున్నారు : వైఎస్ షర్మిల

కేసీఆర్ సర్కార్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మరోసారి ట్వి్ట్టర్ వేదికగా మండిపడ్డారు. కష్టం ఒకరిదైతే..ప్రచారం మరొకరిది అనే సామెత కేసీఆర్ కి సరిపోతుందని వ్యాఖ్యానించారు. పాలమూరు కనీళ్లను చూసి YSR సాగునీళ్లు ఇస్తే.. తట్టెడు మట్టి మోయని KCR.. తానే జలకళ తెచ్చినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. YSR జలయజ్ఞం కింద వేసిన పునాదులే..నేడు కేసీఆర్ చెబుతున్న 20 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే ప్రాజెక్టులని చెప్పారు.

https://twitter.com/realyssharmila/status/1668550067966599168

‘‘YSR హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే.. మీ పదేళ్ల పాలనలో ఒక్క ఏకరాకు అదనంగా సాగునీరు ఇచ్చారా దొర గారు..?’’ అని కేసీఆర్ ను వైఎస్ షర్మిళ ప్రశ్నించారు. YSR బతికి ఉంటే పాలమూరు ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. పడావు బడ్డ పాలమూరు భూములకు సాగునీళ్లు ఇచ్చిన అపర భగీరథుడు YSR అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లైనా ఇంకా వలసలు ఆగలేదన్నారు.