ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సంతోష్

ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు : ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వ సంబంధించే ప్రీ మెట్రిక్ స్కాలర్​షిప్ లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో స్కాలర్​షిప్ అంశంపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపాటు 9, 10 తరగతి తరగతులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు స్కాలర్​షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

ఈ ఏడాది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లకు కూడా స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమశాఖ ఆఫీసర్ నుషిత, బీసీ సంక్షేమశాఖ ఆఫీసర్ అక్బర్ బాషా, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఫుడ్ అమ్మకాలపై పర్యవేక్షణ పెంచాలి..

ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఫుడ్ విక్రయించే హోటల్స్ ఇతర కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్ లో జిల్లాస్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రతినెలా 25 హోటల్స్ లో మాత్రమే ఫుడ్ శాంపిల్స్​ సేకరించి ల్యాబ్ కు పంపుతున్నారని, వీటి సంఖ్యను పెంచాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1278 ఆహార విక్రయాల్లో సంబంధిత శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని తెలిపారు.