ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.శరణ్య

ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు  : అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.శరణ్య

కోడేరు, వెలుగు : సీనియర్ల పేరుతో ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.శరణ్య హెచ్చరించారు. మంగళవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చట్టాలపై బాలికలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

 మహిళలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. బాలికలకు ఏమైనా సమస్యలుంటే తల్లిదండ్రులు లేదా అధ్యాపకులకు చెప్పాలన్నారు. బాలికల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. బాల్యవివాహాలు, ఆన్​లైన్ బెట్టింగ్స్, సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెట్టరీ రేణుకనాగరాజు, ప్రిన్సిపాల్ వీఎస్ ప్రమీల, ఎస్ఐ వి.సతీశ్, అడ్వకేట్స్, విద్యార్థినులు పాల్గొన్నారు.