నకిలీ మద్యం కేసు.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

నకిలీ మద్యం కేసు.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం(నవంబర్ 2) ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జోగి రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్​ తో పాటు ఆయన పీఏ ఆరేపల్లి రామును అరెస్ట్‌ చేశారు. 

జోగి రమేశ్‌ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు ఇచ్చిన వాంగ్మూలంతో జోగి రమేశ్‌ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.

జోగి రమేష్ ను అరెస్ట్  చేశారని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసనలు తెలిపారు.