2 వారాల్లో సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఖాయమా : ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

2 వారాల్లో సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఖాయమా : ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఏపీ రాజకీయాల్లోనే కీలక మలుపు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ కు లైన్ క్లియర్ అయ్యిందా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో అరెస్ట్ ఖాయమా అనే ప్రచారం ఊపందుకున్నది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు సజ్జల భార్గవ్ రెడ్డి. ఈ పిటీషన్ పై విచారించిన అత్యున్నత న్యాయ స్థానం.. 2025, మే 23వ తేదీన కీలక ఆదేశాలు ఇచ్చింది.

ముందస్తు బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకే రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చింది సుప్రీంకోర్టు. ముందస్తు బెయిల్ విషయాన్ని ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని అనుకుంటున్నారా.. మీరు ఏ ఆలోచనతో ఈ పోస్టులు పెట్టారో మేం తెలుసుకోగలం.. ఊహించగలం అంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా.. వ్యవస్థ శిక్షిస్తుందని.. మీరు ఏ ఆలోచనలతో పోస్టులు పెట్టారో ఊహించుకోలేమా అని వ్యాఖ్యానించింది కోర్టు.

ఈ విషయంలో రాజకీయాలు అసంబద్ధం అని.. అరెస్ట్ నుంచి రెండు వారాల వరకే మధ్యంతరం ఉపశమనం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ట్రయల్ కోర్టును ఆశ్రయించటానికి.. అరెస్ట్ చేయకుండా ఉండటానికి కేవలం 2 వారాల సమయం మాత్రమే గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు లేటెస్ట్ ఆదేశాలతో.. 2 వారాల తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఖాయమని రాజకీయ వర్గాల్లో.. ముఖ్యంగా టీడీపీ పార్టీ జోరుగా చర్చ నడుస్తుంది.