గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదంటూ పీఎస్ లో పిర్యాదు చేశారు మహిళలు. రాజధాని మార్పుపై కొన్ని రోజులుగా రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టిన మహిళలు ర్యాలీగా వెళ్లి తుళ్లూరు పోలీసులకు వినతి పత్రం ఇచ్చారు. తమ సమస్యలను చెప్పుకుందామంటే శ్రీదేవి వారం రోజులుగా కనిపించడం లేదని ఆచూకి కనిపెట్టాలంటూ ఫిర్యాదు చేశారు. ఇంటి దగ్గర వెతికినా? ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లినా ఎక్కడా? కనిపించడం లేదని చెప్పారు. ఎమ్మెల్యే ఎక్కడున్నా తమ సమస్యలు విని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

