
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పీవీపీ సూర్యనారాయణరాజు, పోతుల సునీత, కోలా గురువులు , బొమ్మ ఇజ్రాయిల్, జయమంగళ వెంకటరమణ, ఏసురత్నం, మర్రి రాజశేఖర్‌లు నామినేషన్ వేశారు. అభ్యర్థులు తొలుత సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోగా వారికి సీఎం వైఎస్ జగన్ బీ ఫారమ్స్ అందజేశారు. అనంతరం వారు అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, నంబురి శంకర్ రావు, ఉండవల్లి శ్రీ దేవి, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలసిల రఘురామ్, జంగా కృష్ణ మూర్తిలు ఉన్నారు.