చంద్రబాబు రోడ్ షోలో కరెంట్ తీసేసి రాళ్ల దాడి

చంద్రబాబు రోడ్ షోలో కరెంట్ తీసేసి రాళ్ల దాడి

ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో  టీడీపీ అధినేత  చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు రోడ్ షో కొనసాగుతుండగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు.  విద్యుత్ సరఫరా నిలిపివేసి చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన  ఎన్ ఎస్ జీ  కమోండోలు చంద్రబాబుకు రక్షణగా నిలవడంతో  కమాండెంట్ సంతోష్ తలకు రాయి తగిలింది. ఆయనకు మూడు కుట్లు పడ్డాయి.  ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సంఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు ఇరు వర్గాల మధ్య దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

తనపై రాళ్ళు విసరడంతో వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని.. తమ పార్టీ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తన ముందు కుప్పిగంతులు వేయొద్దన్నారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. జగన్‌ లాంటి రాజకీయ నాయకుడిని దేశంలో ఎక్కడా చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.