3రాజధానుల కోసం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా

3రాజధానుల కోసం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా

వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  కరణం ధర్మశ్రీ  రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటుగా అయిన నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ కు అందించారు. వీకేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్‌ చేశారు.

తిరిగి టెక్కలి నుంచి  పోటీ చేయాలని  సవాల్‌ విసిరారు. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. ముమ్మాటికి అమరావతికి తాము వ్యతిరేకమేనని ధర్మశ్రీ అన్నారు. ఇదిలా ఉంటే, ఈనెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వికేంద్రీకరణ జేఏసీ ప్రకటించింది. టూ టౌన్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపింది.