రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? 

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? 

హైదరాబాద్: సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ కు ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టెక్కించడం చేతకావడం లేదని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు బస్ టిక్కెట్లు రేట్ల పెంపు తప్పదంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఫైర్ అయ్యారు. ఎందుకు ఈ నష్టాల డ్రామా అంటూ కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని ఆమె పలు ట్వీట్లు చేశారు. చదివేస్తే ఉన్న మతిపోయినట్లు, ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకుపోయానని కేసీఆర్ చెబుతారని.. కానీ సీఎం పదవిలో ఉండి ఆయన చేసిందేంటన్నారు. ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టెక్కించడంలో ఆయన ఫెయిల్ అయ్యారని విమర్శించారు. 

ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఛార్జీల పెంపునకు కేసీఆర్ తయారయ్యారని షర్మిల అన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఛార్జీలు పెంచిన దొర.. మూడోసారి పెంపునకు రెడీ అయ్యారని దుయ్యబట్టారు. కేసీఆర్ తలచుకుంటే ఆర్టీసీ నష్టాలను పూడ్చడం కష్టమా అని క్వశ్చన్ చేశారు. ఆర్టీసీని తన అనుచరులకు అప్పగించేందుకే కేసీఆర్ ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.