
హైదరాబాద్, వెలుగు : వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి పెండ్లి అట్లూరి ప్రియతో నిశ్చయమైనట్టు తెలిపింది. ఈనెల18న ఎంగేజ్ మెంట్, వచ్చే నెల 17న పెండ్లి ఉంటుందని సోమవారం షర్మిల ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశా రు.
కొడుకు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ కలిసి ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేశారు. తన కొడుకు పెండ్లి వేడుక ప్రకటనను మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ.. ఆమె న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.