నాలుగేండ్లయినా బీసీ పాలసీ ఊసే లేదు

నాలుగేండ్లయినా  బీసీ పాలసీ ఊసే లేదు

హైదరాబాద్: బీసీల పాలన అమలు చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. దాన్ని మర్చిపోయారని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. మాట ఇచ్చి నాలుగేండ్లు అవుతున్నా బీసీ పాలసీ అమలు కావడం లేదన్నారు. బీసీలు అంటే మీటింగ్‌లకు మందిని తెచ్చేవారు, గొర్లు, బర్లు కాసుకునే వారు, ఆత్మగౌవర భవనాలకు అమ్ముడుపోయే వారిలాగే కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దృష్టిలో బీసీలు అధికారంలో పాలుపంచుకునేందుకు, చట్టాలు చేసేందుకు, అభివృద్ధికి నోచుకునేందుకు అర్హులు కాదన్నారు. అందుకే కేసీఆర్ 2017లో మీటింగ్ పెట్టి మూడ్రోజులు చేసిన 210 తీర్మానాలను మూలకు పెట్టారన్నారు. బీసీ సబ్ ప్లాన్, ఇండస్ట్రియల్ పాలసీ, నిధులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కావడం లేదన్నారు. ఇది కేసీఆర్‌కు 54 శాతంగా ఉన్న బీసీలపై ఉన్న ప్రేమ అని షర్మిల పేర్కొన్నారు.