
- నివాళులర్పించిన ఎమ్మెల్యే కూనంనేని
పాల్వంచ, వెలుగు: పట్టణంలోని కేటీపీఎస్ కాలనీలో నివాసం ఉండే ధారావత్ రమేశ్ (47) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌లో చనిపోయారు. రమేశ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించిన వైద్యులు ఆర్గాన్స్ డొనేషన్ కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. వారు అంగీకరించడంతో రమేశ్ కళ్లు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివర్ సేకరణ అనంతరం ఆసుపత్రి సిబ్బంది మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సోమవారం పాల్వంచలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రమేశ్ డెడ్‌బాడీని మృత దేహాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్లు ఎం. ప్రభాకర్ రావు, కే. శ్రీనివాస బాబుసందర్శించి నివాళులర్పించారు. మృతుడికి భార్య నాగ కళ్యాణి, కూతురు లాస్య ఉన్నారు. ఆయన భార్య కేటీపీఎస్ లో పని చేస్తున్నారు.
పాల్వంచలోని కేటీపీఎస్ లో 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ఏఈ నుంచి ఏడీఈ వరకు వివిధ హోదాలలో పనిచేసిన రమేశ్ డీఈగా పదో న్నతిపై వైటీపీఎస్ వెళ్లారు . బైక్‌పై డ్యూటీకి వెళుతుండగా కింద పడి తీవ్ర గాయాల పాలయ్యారు. క్రికెట్ , షటిల్ బ్యాట్మెంటన్, ఫుట్ బాల్ క్రీడల్లో ప్రావీణ్యం కలిగిన రమేశ్ పలు క్రీడల్లో జెన్కో ఛాంపియన్ గా నిలిచారు.