గో హత్యలను అరికట్టండి: కేసీఆర్ కు యుగతులసీ బహిరంగ లేఖ

గో హత్యలను అరికట్టండి: కేసీఆర్ కు యుగతులసీ బహిరంగ లేఖ

హైదరాబాద్ లో గోహత్యలు జరగడంపై తీవ్రంగా స్పందించారు యుగతులసీ గో సేవా ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్. గో హత్యలపై వెంటనే చర్యలు తీసుకుని.. గోవులను రక్షించాలంటూ సీఎం కేసీఆర్ కు బహింరగ లేఖ రాశారు. ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదిలే గోవుని ప్రతిరోజూ పొట్టనపెట్టుకుంటూ ఆక్సిజన్ కోసం ప్రపంచమంతా పరుగులు తీస్తున్నామంటూ లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు..పవిత్రంగా చూడాల్సిన గోవుని అత్యంత పాశవికంగా హతమారుస్తున్న దారుణ కృత్యం భాగ్యనగర్ నడిబొడ్డున ప్రతిరోజూ జరుగుతూనే ఉంది. ఒకవైపు ప్రకృతి కోపానికి మనిషి బలై పోతుంటే మనిషి పైశాచికత్వానికి వేలాది మూగ జీవులు బలై పోతున్నాయి. పంచ గవ్యాలతో పంచ ప్రాణాలు నిలుపుకునే అవకాశం ఉన్నా పట్టనట్టు ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నాం.

గోవు నెత్తురు ఏరులై పారుతున్న చోట భూమాత ప్రశాంతంగా ఎలా ఉంటుంది. ప్రకృతి శాంతించాలన్నా, కరోనా తగ్గుముఖం పట్టాలన్నా తక్షణం కబేళాలు మూసేయండి. కనీసం 41 రోజులు తెలంగాణ రాష్ట్రంలో గో హత్యలు ఆపి చూడండి. కరోనా ఖచ్చితంగా శాంతిస్తుంది. గోమాత రక్షణే భూమాత రక్షణ. తెలంగాణ ప్రజల ప్రాణాలను రక్షించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గో హత్యలు కూడా ఆపి చూడండి. తేడా మీకే అర్ధం అవుతుంది. దయచేసి గో హత్యలు ఆపడం ద్వారా మానవజాతి వినాశనాన్ని ఆపాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ ద్వారా తెలిపింది యుగతులసీ గో సేవా ఫౌండేషన్.