ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే గో హత్యలు పెరుగుతున్నయ్

ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే గో హత్యలు పెరుగుతున్నయ్

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గో హత్యలు పెరిగిపోతున్నాయని యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్ ఆరోపించారు. జులై 2న హైదరాబాద్ లో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మింట్ కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన శివ కుమార్..  గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడమే ప్రధాన ఎజెండాగా ఉండాలన్నారు. 108 గోవుల కొమ్ములకు నల్ల జెండాలు కట్టి నిరసన యాత్ర నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. మోడీ ప్రధాని కాకముందు గోవులపై చూపించిన ప్రేమ , ఇప్పుడు ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించే వరకు యుగ తులసి ఫౌండేషన్ పోరాడుతుందని డిమాండ్ చేశారు.

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గో హత్యలు ఆపాలని, అక్రమ కబేళాలను మూసివేయాలని యుగ తులసి ఫౌండేషన్ ఉద్యమాలు చేస్తూ వస్తోందన్నారు. గోమాత ప్రత్యేకత, విశిష్టత గురించి  యుగతులసి ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ముక్కోటి దేవతలు ఒక్క జంతువులో కొలువై ఉన్నాయని అంటే అదీ గోమాత అని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. అలాంటి గో మాతను అక్రమంగా కబేళాలకు తరలించడం, చంపి తినడం మానవత్వమే కాదని కోరుతోందని. .అలాంటి వాటిని అరికట్టాలన్న లక్ష్యంతోనే ఈ ఉద్యమం యుగ తులసి ఫౌండేషన్ నిర్వహిస్తుందన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు