జెనీవా ఓపెన్‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌: యూకీ జోడీ ఔట్‌‌‌‌‌‌‌‌

జెనీవా ఓపెన్‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌: యూకీ జోడీ ఔట్‌‌‌‌‌‌‌‌

జెనీవా: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ యూకీ భాంబ్రీ–రాబర్ట్‌‌‌‌‌‌‌‌ గాలోవే (అమెరికా).. జెనీవా ఓపెన్‌‌‌‌‌‌‌‌లో నిరాశపర్చారు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌ యూకీ–రాబర్ట్‌‌‌‌‌‌‌‌ 6–7 (3/7), 4–6తో అన్‌‌‌‌‌‌‌‌సీడెడ్‌‌‌‌‌‌‌‌ జాకబ్‌‌‌‌‌‌‌‌ ష్నైటర్‌‌‌‌‌‌‌‌–మార్క్‌‌‌‌‌‌‌‌ వాల్నర్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ) చేతిలో కంగుతిన్నారు.

ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌కు సన్నాహకంగా జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండో–అమెరికన్‌‌‌‌‌‌‌‌ జోడీ తొలి సెట్‌‌‌‌‌‌‌‌లో గట్టి పోటీ ఇచ్చింది. కానీ రెండో సెట్‌‌‌‌‌‌‌‌లో సర్వీస్‌‌‌‌‌‌‌‌లను కాపాడుకోవడంలో విఫలమైంది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో రెండు ఏస్‌‌‌‌‌‌‌‌లు, ఒక డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన యూకీ–రాబర్ట్‌‌‌‌‌‌‌‌.. ఎనిమిది బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఒక్కదాన్ని మాత్రమే కాపాడుకున్నారు. ఇక ఏడు ఏస్‌‌‌‌‌‌‌‌లు, ఒక డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌‌‌‌‌తో జాకబ్‌‌‌‌‌‌‌‌–వాల్నర్‌‌‌‌‌‌‌‌ రెండు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను కాచుకున్నారు.