ఎంతో అంకితభావం కలిగిన క్రికెటర్ కోహ్లీ అంటూ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసించాడు. భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిగా నిలిచాడంటూ ట్వీట్ చేశాడు. క్రికెటర్ గానే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా కోహ్లీ ఎదిగిన తీరును తాను చూశానని చెప్పాడు.
ఒక కుర్రాడిగా నెట్ సెషన్ లో భారత దిగ్గజ క్రికెటర్లతో కలిసి నడిచావని... రాబోయే తరాలకు మార్గం చూపుతూ ఇప్పుడు నువ్వొక లెజెండ్ గా మారావంటూ ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్. ఏదో ఒక రోజు బ్లూ జెర్సీ ధరించాలని కలలు కనే యువతకు స్ఫూర్తిప్రదాతగా నిలిచావని అన్నాడు. నువ్వొక దిగ్గజ సారధివని ప్రశంసించాడు.
ఆట పట్ల నీలో ఉన్న అగ్నిని అలాగే రగిలిస్తూ ఉంచాలని సూచించాడు. జట్టులో సహచర ఆటగాడిగానే కాకుండా... ఒక స్నేహితుడిగా మన మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పడం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. పరుగులు చేయడం, కప్ లను సొంతం చేసుకోవడం, పంజాబీ పాటలను వినడం.. ఇలా అన్నీ ప్రత్యేకమైనవేనని యువీ ట్వీట్ చేశాడు.
Yuvraj lavished massive praises on Kohli and recalled his journey from a youngster to one of the greats of the game.https://t.co/SOC3zND5rd
— CricTracker (@Cricketracker) February 22, 2022
మరిన్ని వార్తల కోసం..
