శంషాబాద్​ బ్రాండ్​ అంబాసిడర్ గా  జబర్దస్త్ ​ఫేమ్ ​రాకేశ్

శంషాబాద్​ బ్రాండ్​ అంబాసిడర్ గా  జబర్దస్త్ ​ఫేమ్ ​రాకేశ్

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపల్ బ్రాండ్ అంబాసిడర్ గా జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్​ ను ఎంపిక చేశారు. ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ –-2022 కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా ఆయన హాజరయ్యారు. అనంతరం ఎలైట్ హోటల్ లో మున్సిపల్ సిబ్బంది, అంగన్​వాడీ టీచర్లకు అవేర్​నెస్​​ప్రోగ్రాం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ సుష్మ, నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేశ్​ గౌడ్, కౌన్సిలర్ తోకల విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్లు భారతమ్మ, నజియా అంజద్, మస్రత్ జాన్ తాజ్ బాబా, సుధాకర్ రెడ్డి, వెంకటేశ్ ముదిరాజ్, జహంగీర్ ఖాన్, మున్సిపల్ సిబ్బంది, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.