జాక్‌‌‌‌ క్రాలీ సెంచరీ .. ఇంగ్లండ్‌‌‌‌ 384/4

జాక్‌‌‌‌ క్రాలీ  సెంచరీ .. ఇంగ్లండ్‌‌‌‌ 384/4

మాంచెస్టర్‌‌‌‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌‌‌‌ నాలుగో టెస్ట్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. జాక్‌‌‌‌ క్రాలీ (182 బాల్స్‌‌‌‌లో 31 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 189) భారీ సెంచరీతో చెలరేగడంతో.. గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 72 ఓవర్లలో 384/4 స్కోరు చేసింది. హ్యారీ బ్రూక్‌‌‌‌ (14 బ్యాటింగ్‌‌‌‌), బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (24 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. 9 రన్స్‌‌‌‌కే బెన్‌‌‌‌ డకెట్‌‌‌‌ (1) ఔటైనా, క్రాలీ అద్భుతంగా ఇన్నింగ్స్‌‌‌‌ను నిర్మించాడు. మొయిన్‌‌‌‌ అలీ (54)తో కలిసి రెండో వికెట్‌‌‌‌కు 121 రన్స్‌‌‌‌, జో రూట్‌‌‌‌ (95 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 84)తో కలిసి మూడో వికెట్‌‌‌‌కు 206 రన్స్‌‌‌‌ జత చేసి వెనుదిరిగాడు.

చివర్లో బ్రూక్‌‌‌‌, స్టోక్స్‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌కు 33 రన్స్‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌ను పటిష్టం చేశారు. స్టార్క్‌‌‌‌ 2, హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌, గ్రీన్‌‌‌‌ చెరో వికెట్‌‌‌‌ తీశారు. ప్రస్తుతం హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ 67 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో ఉంది. అంతకుముందు 299/8 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో రెండో రోజు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 90.2 ఓవర్లలో 317 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ (36 నాటౌట్‌‌‌‌) మెరుగ్గా ఆడినా, కమిన్స్‌‌‌‌ (1), హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ (4) నిరాశపర్చారు. ఇంగ్లిష్‌‌‌‌ బౌలర్లలో క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ 5, స్టువర్ట్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌ 2 వికెట్లు తీశారు.