ప్రస్తుతం ఇండియా నుంచి పరారీలో ఉన్న వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రచార బోధకుడు జకీర్ నాయక్ రూ.2.75కోట్లు కట్టాలంటూ యూ కే మీడియా నోటీసులు జారీ చేసింది. జకీర్ కు దేశ విదేశాల్లో పలు మీడియా సంస్థలున్నాయి. అయితే ఆయనకు చెందిన యూ కే మీడియా సంస్థలో విద్వేష పూరిత ప్రసంగం, హత్యకు ప్రేరేపించేలా కథనాల్ని ప్రసారం చేశారంటూ యూకే మీడియా ప్రభుత్వ మీడియా సంస్థ ఆఫ్ కామ్ జరిమానాను విధించాయి.
పీస్ టీవీ, లార్డ్ కమ్యూనికేషన్స్ హోల్డింగ్ కంపెనీకి, యు కె కమ్యూనికేషన్ సర్వీసెస్ రెగ్యులేటర్ మొత్తం లక్ష పౌండ్లు, పీస్ టీవీ ఉర్దూ, క్లబ్ టీవీకి రెండు లక్షల పౌండ్లు జరిమానా విధించారు. తమ దేశ మీడియా ఉల్లంఘనలకు విరుద్దంగా ప్రసారాలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది.
2019,జులైలో ప్రసారమైన ‘కితాబ్ – ఉట్ -తౌహీద్’ అనే మతపరమైన కార్యక్రమంలో ఇంద్రజాలికులకు మరియు మాయాజాలం చేసేవారికి ఇస్లామిక్ శిక్ష గురించి చర్చిస్తూ ప్రసారం చేసింది. ఈ కార్యక్రమంలో హత్యకు ప్రేరేపించేలా ప్రసంగాలు ఉన్నాయంటూ ఆఫ్ కామ్ అభిప్రాయపడింది.
