చార్మినార్​ నేపథ్యంలో..జమాన

చార్మినార్​ నేపథ్యంలో..జమాన

సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో భాస్కర్ జక్కుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జమాన’. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టైటిల్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోను ఆవిష్కరించిన దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

దర్శకుడి విజన్ నచ్చింది. ముఖ్యంగా చార్మినార్ దగ్గర తీసిన షాట్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. ‘ఈ తరం యువత ఆలోచనలకు అద్దం ప‌‌ట్టే ఆస‌‌క్తిక‌‌ర‌‌మైన క‌‌థ‌‌, క‌‌థ‌‌నాల‌‌తో ఈ సినిమా ఉంటుంది’ అని హీరో సూర్య శ్రీనివాస్ అన్నాడు. ‘చార్మినార్, ఓల్డ్ సిటీ బ్యాక్‌‌డ్రాప్‌‌లో యూత్‌‌కి నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో యూత్‌‌ఫుల్ ఎంట‌‌ర్‌‌టైన‌‌ర్‌‌‌‌గా దీన్ని తెరకెక్కించాం’ అని దర్శకుడు భాస్కర్ తెలియజేశాడు.