హైదరాబాద్, వెలుగు: పీఎల్ క్యాపిటల్ (ప్రభుదాస్ లీలాధర్ గ్రూప్) సీఈఓగా జరీన్ దారువాలా నియమితులయ్యారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవల పరిశ్రమలో ఆమెకు 35 ఏళ్ల అనుభవం ఉందని పీఎల్ క్యాపిటల్ తెలిపింది. ఇది వరకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈఓ (ఇండియా సౌత్ ఆసియా)గా పనిచేశారు. జరీన్ నాయకత్వంలో బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారం భారీగా పెరిగిందని, వెల్త్ మేనేజ్‌మెంట్ -ఫోకస్డ్‌గా మారిందని పీఎల్ క్యాపిటల్ పేర్కొంది. తమ బ్రోకింగ్ డిస్ట్రిబ్యూషన్, ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్, ప్రైవేట్ క్రెడిట్, వెల్త్ మేనేజ్‌మెంట్ అసెట్ మేనేజ్‌మెంట్ సర్వీసు వ్యాపారాలను నడిపించడంలో జరీన్ కీలక పాత్ర పోషిస్తారని ప్రకటించింది.
