Layoffs : మొబైల్ కంపెనీలో 700 ఐటీ ఉద్యోగుల తొలగింపు

Layoffs : మొబైల్ కంపెనీలో 700 ఐటీ ఉద్యోగుల తొలగింపు

జీబ్రా టెక్నాలజీలో అమ్మకాల మందగమనం మధ్య 700 మంది ఉద్యోగులను.. అంటే కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 7 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనుంది. USలో సెక్యూరిటీల ఫైలింగ్‌లో, పెట్టుబడిదారులతో ఇటీవలి కాల్‌లలో ఉద్యోగాల కోతలు వెల్లడయ్యాయి. “జీబ్రా నిర్వహణ ఖర్చులు, పెట్టుబడులను దీర్ఘ-కాలిక దృక్పథంతో చాకచక్యంగా నిర్వహించడంలో ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. క్రమశిక్షణతో కూడిన విధానం సుదీర్ఘ విజయ చరిత్రను ఎనేబుల్ చేసింది. సవాలు సమయాల్లో విజయం సాధించేందుకు మమ్మల్ని సిద్ధం చేసింది” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. "మేము ప్రస్తుతం కష్టతరమైన, అనిశ్చిత వ్యాపార వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాం. దీర్ఘకాలంలో మా వ్యాపారాన్ని బలోపేతం చేసే వ్యాపారంలోని భాగాలలో పునఃప్రాధాన్యత, పెట్టుబడి పెట్టడానికి ఈ చర్యలు అవసరమని మేము విశ్వసిస్తున్నాం" అని తెలిపింది. మహమ్మారి విజృంభణ తరువాత, అమ్మకాల మందగమనం మధ్య ఉద్యోగ కోతలు ప్రకటించారు.

ALSO READ :ఆదిత్య ఎల్ 1 కౌంట్ డౌన్ : రెడీ టూ లాంఛ్

జీబ్రా తన మొత్తం మూడవ త్రైమాసిక ఆదాయం 2022లో 30-35 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. ఈ సంవత్సరం మొత్తం అమ్మకాలు 20-23 శాతం తగ్గాయి. మహమ్మారి సమయంలో హ్యాండ్‌హెల్డ్ కంప్యూటర్‌లు, బార్-కోడ్ పరికరాలను అనేక రిటైలర్‌లు ఉపయోగించడంతో కంపెనీ బలమైన వృద్ధిని సాధించింది. డిసెంబర్ 2021లో ఈ కంపెనీ స్టాక్ మూడు రెట్లు ఎక్కువ పెరిగి దాదాపు 6వందల డాలర్లకి చేరుకుంది. దీని ఉత్పత్తులలో మొబైల్ కంప్యూటర్లు, టాబ్లెట్‌లు, సాఫ్ట్‌వేర్, థర్మల్ బార్‌కోడ్ లేబుల్, రసీదు ప్రింటర్లు ఉన్నాయి.