
న్యూఢిల్లీ: వివిధ మార్గాల్లో రూ.2 వేల కోట్లను సేకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని జీ ఎంటర్‌టైన్‌మెంట్ గురువారం ప్రకటించింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐపీ)కు షేర్లను అమ్మడం ద్వారా కూడా కంపెనీ ఫండ్స్ సేకరించనుంది. షేర్ హోల్డర్లు, రెగ్యులేటరీ అనుమతుల వచ్చాక ఫండ్స్ సేకరణ ఉంటుందని జీ ఎంటర్‌టైన్‌మెంట్ పేర్కొంది. ఈ ఫండ్స్‌ను దేని కోసం వాడతారనేది ప్రకటించలేదు. కానీ, ఇందులో కొంత భాగం బిజినెస్ విస్తరణకు వాడనున్నారని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. జీ–సోనీ విలీనం డీల్ రద్దయిన తర్వాత జీ ఎంటర్‌టైన్‌మెంట్ చేపడుతున్న మొదటి ఫండ్ రైజింగ్ ఇది.