నాటో సభ్యత్వం కోసం అడుక్కోం

నాటో సభ్యత్వం కోసం అడుక్కోం
  • మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ
  • లుహాన్​స్క్​, డెనెట్​స్క్​ ప్రాంతాలపై రాజీకి సిద్ధమని ప్రకటన 

లండన్: రష్యా దండయాత్రకు కారణమైన ‘నాటో సభ్యత్వం’ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటోలో తాము చేరబోమని, తమకు సభ్యత్వం వద్దని స్పష్టం చేశారు. రష్యాతో ఘర్షణ విషయంలో నాటో భయపడుతోందని, అడుక్కునే దేశంగా ఉక్రెయిన్ ఎంతమాత్రమూ ఉండబోదన్నారు. రష్యా అనుకూల లుహాన్‌స్క్, డెనెట్‌స్క్ రీజియన్ల విషయంలో చర్చల ద్వారా రాజీకి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అమెరికాకు చెందిన ఏబీసీ న్యూస్‌కి సోమవారం రాత్రి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

సభ్యత్వం కోసం అడుక్కోం..
‘‘చర్చలకు రెడీ. కానీ మేం సరెండర్ కాబోం. ఎందుకంటే ఇది నా ఒక్కడి గురించిన సమస్య మాత్రమే కాదు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు సంబంధించినది. ఉక్రెయిన్‌‌ను తమ సభ్య దేశంగా అంగీకరించేందుకు నాటో సిద్ధంగా లేదు. వివాదాస్పద విషయాలకు, రష్యాతో ఘర్షణకు ఈ కూటమి భయపడుతోంది. అందుకే నాకు నాటో మీద ఆసక్తి పోయింది” అని జెలెన్‌‌స్కీ చెప్పారు. నాటో సభ్యత్వం విషయంలో జరుగుతున్న జాప్యంపై స్పందిస్తూ.. ‘‘మోకాళ్లపై కూర్చుని అడుక్కునే దేశంగా ఉండటానికి ఉక్రెయిన్ ఇష్టపడదు. ఉక్రెయిన్ అలాంటి దేశం కాబోదు. నేను అలాంటి అధ్యక్షుడిని కావాలనుకోలేదు’’ అని తేల్చి చెప్పారు. 

అవి సూడో రిపబ్లిక్స్
తాను చర్చలకు సిద్ధంగా ఉన్నానని, భద్రతా పరమైన గ్యారంటీల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని జెలెన్‌‌స్కీ తెలిపారు. చర్చలకు, రాజీకి కూడా తాము సిద్ధమేనని, కానీ లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  ‘‘రెండు (లుహాన్‌‌స్క్, డెనెట్‌‌స్క్) రీజియన్లను ఒక్క రష్యా తప్ప ఇంకెవరూ గుర్తించలేదు. అవి సూడో రిపబ్లిక్స్. ఈ రెండు రీజియన్ల మనుగడ గురించి, ఉక్రెయిన్‌‌లో ఎవరు భాగమవుతారనే దానిపై చర్చించి, రాజీకి రావచ్చు” అని వివరించారు. తాము అల్టిమేటమ్స్‌‌కి సిద్ధంగా లేమని.. ఏదైనా సరే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ముందు పుతిన్ మాట్లాడాలని సూచించారు.

గాలి, నీరు, నేలపై పోరాటం కొనసాగిస్తం
‘‘ఈ యుద్ధాన్ని మేం మొదలుపెట్టలేదు. మేం కోరుకోలేదు కూడా. ఇదే సమయంలో మా దేశానికి చెందిన దేన్నీ మేం వదులుకోబోం” అని జెలెన్‌‌స్కీ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌‌ను ఉద్దేశించి జెలెన్‌‌స్కీ వర్చువల్‌‌గా హిస్టారిక్‌‌ స్పీచ్ ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటన్ ప్రధాని చర్చిల్ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మేం వాళ్లతో సముద్రంలో, గాలిలో, అడవుల్లో, పొలాల్లో, వీధుల్లో.. పోరాడుతం. ఎట్టి పరిస్థితుల్లోనూ సరెండర్ కాబోం” అని స్పష్టం చేశారు. 13 రోజులుగా రష్యా తమపై సాగిస్తున్న విధ్వంసకాండ గురించి బ్రిటన్ ఎంపీలకు వివరించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి తాము నిద్రపోవడం లేదని, క్రూయిజ్ మిసైళ్లతో తమపై దాడులు చేస్తున్నారని, తమ దేశం కోసం పోరాడుతున్నామని తెలిపారు. రష్యాపై ఆంక్షలను పెంచాలని, ఉగ్ర దేశంగా ప్రకటించాలని, ఉక్రెయిన్ గగనతలాన్ని భద్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ప్రసంగం సందర్భంగా స్క్రీన్‌‌పై జెలెన్‌‌స్కీ కనిపించగానే.. ప్రధాని బోరిస్ జాన్సన్ సహా ఎంపీలందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చప్పట్లతో మద్దతు ప్రకటించారు. ఆయన స్పీచ్‌‌ను వినేందుకు సభ చాంబర్‌‌‌‌లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌