వెంటనే హింసను ఆపాలని ప్రధాని మోడీ పిలుపు

వెంటనే హింసను ఆపాలని ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ:  ఉక్రెయిన్ లో వెంటనే హింసను ఆపాలని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పిలుపునిచ్చారు. శాంతి దిశగా ఎలాంటి సహాయానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శనివారం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో ప్రధాని ఈ మేరకు ఫోన్ లో మాట్లాడినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంలో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరుగుతుండటం పట్ల ప్రధాని మోడీ ఆందోళన ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొంది.  ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్న పరిణామాలను జెలెన్ స్కీ ఈ సందర్భంగా మోడీకి వివరించారని తెలిపింది. కాగా, ‘‘మా దేశంలోకి లక్ష మందికిపైగా రష్యన్ సోల్జర్లు చొరబడ్డారు. జనవాసాలు, ఇండ్లపైనా కాల్పులు జరుపుతున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాకు మద్దతు ఇవ్వాలని ఇండియాను కోరాం. అందరం కలిసి దురాక్రమణను అడ్డుకుందాం” అని జెలెన్ స్కీ ట్వీట్ చేశారు.