బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం చర్యలు

బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం చర్యలు

బాల్య వివాహాలను అరికట్టడంపై అసోం ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా 1,800 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని పోలీసులను ఆదేశించారు. బాల్య వివాహాల నిషేధ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించే 1800 మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు. 

మహిళలపై నేరాలకు పాల్పడే వారిని అస్సలు వదిలిపెట్టకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం పోలీసులను ఆదేశించినట్లు హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. 15 రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 4,000కుపైగా కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునేవారిపై, పోక్సో చట్టం కింద అభియోగాలు మోపాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. ఇలాంటి విషయాల్లో వివాహానికి మద్దతు తెలిపే మతపెద్దలు, పురోహితులు తదితరులపైనా చర్యలు తీసుకుంటామని శర్మ స్పష్టం చేశారు.