ఎం అండ్ ఎం, జొమాటోకి ట్యాక్స్ నోటీసులు

ఎం అండ్ ఎం, జొమాటోకి ట్యాక్స్ నోటీసులు

న్యూఢిల్లీ: ఇన్‌‌‌‌పుట్ సర్వీస్‌‌‌‌ డిస్ట్రిబ్యూటర్ (ఐఎస్‌‌‌‌డీ –  బ్రాంచులు చేసిన సర్వీస్‌‌‌‌లకు గాను కంపెనీ అందుకున్న ఇన్‌‌‌‌వాయిస్‌‌‌‌) ని తప్పుగా వాడినందుకు మహీంద్రా అండ్ మహీంద్రాకు రూ.56 లక్షల జీఎస్‌‌‌‌టీ పెనాల్టీ పడింది. మహీంద్రా టూవీలర్స్‌‌‌‌  లిమిటెడ్‌‌‌‌కు చెందిన టూవీలర్ బిజినెస్‌‌‌‌కు గాను ఈ పెనాల్టీ పడిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది. జీఎస్‌‌‌‌టీ చట్టం అమలు కాకముందు ఉన్న ఐఎస్‌‌‌‌డీ  క్రెడిట్‌‌‌‌ను ప్రస్తుత జీఎస్‌‌‌‌టీ చట్టంలో తప్పుగా వాడారని  జీఎస్‌‌‌‌టీ అధికారులు పేర్కొన్నారు. 

జొమాటో..

కస్టమర్ల నుంచి సేకరిస్తున్న  డెలివరీ ఛార్జ్‌‌‌‌లకు సంబంధించి  జొమాటోకు రూ. 401.7 కోట్ల  జీఎస్‌‌‌‌టీ లయబిలిటీ నోటీస్ అందింది.  డెలివరీ  పార్టనర్ల తరపున  ఈ ఫీజు వసూలు చేస్తున్నామని, తాము ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ఉద్యోగులతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం, వీరు కస్టమర్లకు సర్వీస్‌‌‌‌లు అందిస్తున్నారని, కంపెనీకి కాదని వెల్లడించింది.